మూసిలోకి గోదావరి నీళ్లు : మంత్రి కోమటిరెడ్డి

-

నల్గొండ జిల్లాలో గ్రౌండ్ వాటర్ కాలుష్యం ఎక్కువ. మూసి కాలుష్యం తో.. లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే హైదరాబాద్ లో ఉండే ఫార్మా ఇండస్ట్రీ కెమికల్స్ అన్ని నల్గొండ జిల్లాల్లో కృష్ణా నదిలో కలుస్తున్నాయి. మూసి డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో 1000 కోట్లు అప్పు చేశారు. మేము మూసి శుద్ధి చేసి.. గోదావరి నీళ్ల తో మూసి నీ పారిస్తం. నల్గొండ జిల్లా రైతులు మూసి మురికి తో ఇబ్బంది పడుతున్నారు.

హరీష్.. కేటీఆర్.. మానవత్వం లేని నేతలు. మానవత్వం ఉన్న మనిషి మూసి ప్రక్షాళన మద్దతు ఇస్తారు. ఇన్ని రోజులకు మూసి నరకం నుండి.. మా జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుంది. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ స్టడి రిపోర్ట్ ఇచ్చారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసి మాకు. నల్గొండ అంటే ఎందుకు కేటీఆర్ నీకు కోపం. సాయుధ పోరాటం లో మా జిల్లా నే ఉంది.. మలి దశలో మా జిల్లా నే ఉంది.. మా పోరాట గడ్డ మీద నీకు ఎందుకు కక్ష.. మూసి కంపుతో రోగాల భారిన పడ్డ మాపై ఎందుకు నీకు ఇంత కక్ష అని కేటీఆర్ ను కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version