పాన్ ఇండియా స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 05న విడుదల అయింది. దీంతో డిసెంబర్ 04న కొన్ని థియేటర్లలో ప్రీమియర్స్ షోలు నిర్వహించారు. ఈ తరుణంలో సంధ్య థియేటర్ లో ప్రదర్శించిన ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ విచ్చేసి వీక్షించారు. ఈ తరుణంలోనే అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళా మరణించింది. వాళ్ల కుమారుడు కోమాలో ఉన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా మంత్రి కొండా సురేఖ స్పందించారు. నర్సాపూర్ లో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ తో మాకేం సంబంధం అని ప్రశ్నించారు. పోలీసులకు, చట్టాలకు సంబంధించిన అంశం అది అని.. ఇప్పటికే ఈ ఘటన పై మా సీఎం స్పందించారని చెప్పుకొచ్చారు కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.