BRS నేతలకు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు

-

బీఆర్ఎస్ నేతలకు కీలక సూచనలు చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, హైదరాబాద్ పరిధిలో భారీగా మెట్రో విస్తరణ లాంటి కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఈ అంశాలపై సంబరాలు చేయాలన్నారు.

అలాగే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మానవీయతను చాటుకుందని తెలిపారు. దేశ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా తీసుకొని విధంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఆయా వర్గాల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని నేతలకు కేటీఆర్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version