భూ భారతి బిల్లు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి

-

ఇచ్చిన మాట ప్రకారం ధరణి నీ బంగాళా ఖాతంలో పడేశామని మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన భూ భారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు ఉన్న ప్రతీ ఒక్కరికీ పూర్తిగా భద్రత కల్పించే విధంగా తయారు చేశామని తెలిపారు. ధరణీలో పార్ట్ బీకి సంబంధించి 18లక్షల 26వేల ఎకరాలను ఈ చట్టం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ భూమి అయితే ఏ కారణం చేత పార్ట్ బీలో పెట్టారని సమస్యను పరిష్కరించేవిధంగా చట్టం తీసుకొచ్చామని తెలిపారు.

Ponguleti

ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం. భూములను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత మా ప్రభుత్వాన్ని విన్నారు. ప్రజలకు సంబంధించిన ఆస్తులకు పూర్తి భద్రత ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇండ్లు ఉన్న స్థలాలకు ఏ రకమైన టైటిల్ ఉండదు. గ్రామకంఠాలకు పరిష్కారమార్గం కనుక్కొనేది ఈ చట్టంలో పొందుపరిచాం. వారికి హక్కు ఉన్న కార్డును ఈ చట్టంలో పేర్కొనబడిందని తెలిపారు మంత్రి పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version