బిజెపి, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మంగళవారం ఉదయం బీబీ పేట మండలం కోనాపూర్ లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచంలోనే 10 శాతం పెంచిన వ్యక్తి మంత్రి కేటీఆర్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీబీపేట మండలంలోని కోనాపూర్ కేటీఆర్ నానమ్మ జ్ఞాపకార్థం రూ.2 కోట్ల సొంత నిధులతో పాఠశాలను నిర్మించడం గర్వించదగ్గ విషయమన్నారు.

వందల ఎకరాల భూములు కలిగిన కుటుంబంలో జన్మించిన వ్యక్తి కెసిఆర్ అని చెప్పుకొచ్చారు. మహబూబ్నగర్ లో సున్నాలు వేసుకునేటోడు ఒకడు, నిజామాబాదులో చందాలు వసూలు చేసుకునే వాడు ఇంకొకడు.. కెసిఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఖబర్దార్.. టిఆర్ఎస్ కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.