కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..!

-

మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చం. మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలి, మా పార్టీపై నేపంవేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారు అన్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలే ,వారందరినీ గౌరవిస్తాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నీ మరింత పెంచడానికి అందరూ పాలుపంచుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుతాం అని పేర్కొన్నారు మంత్రి శ్రీధర్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version