ఆయిల్ పామ్ పంటలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన

-

ఆయిల్ పామ్ పంటలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. గోల్కొండ హోటల్లో దక్షిణ రాష్ట్రాల CACP సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచేరి, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ…రైతులు పండించే ప్రతి పంటకు సాగు ఖర్చు తగ్గట్టుగా MSP ధరలు రావడం లేదని, డా. స్వామినాథన్ కమిషన్ ఆధారంగా MSP ధరలను నిర్ణయించాలని CACP కమిషన్ కు సూచనలు చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరలు రైతులకు గిట్టుబాటుగా లేవని పెట్టుబడి ఖర్చులు, లేబర్ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని MSPనిర్ణయించాలని..ఆయిల్ పామ్ కు కూడా మినిమమ్ MSPనిర్ణయించాలని కోరారు.

క్వింటాల్‌కు 18000 రూపాయలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. మిగతా రాష్ట్రాల రైతు ప్రతినిధులు, అధికారులు కూడా సాగు ఖర్చులకు అనుగుణంగానే MSPనిఆయిల్ పామ్, పసుపు, మిర్చికు ఉండాలని..ఆయిల్ పామ్ కు FFB ధర రూ.15000/- టన్నుకు తగ్గకుండా చూడాలని CACP వారిని కోరుతూ లేఖని అందజేశారు మంత్రి తుమ్మల.

Read more RELATED
Recommended to you

Exit mobile version