20 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చింది.. 39 స్థానాలు గెలిచిన BRS మళ్ళీ అధికారంలోకి రాలేదా ? అని హరీష్ రావు పేర్కొన్నారు. 18 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేయలేదు. గత ఎన్నికలలో పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా రాలేద. అంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందని మేము ఆ రోజు అన్నామా.. ఇండియా కూటమి 28 పార్టీల కలయికతో ఆ సీట్లు వచ్చాయి. 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కు 21 శాతం ఓట్లు వచ్చాయి.
ఇక్కడ రేవంత్ పనితీరు బాగలేకపోవడంతోనే మహబూబ్ నగర్ ఎంపీగా ఓడిపోయారు. ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్ లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు. చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు కాంగ్రెస్ లో చేరి సీఎం అయ్యారు రేవంత్. అసలు కాంగ్రెస్ లో హనుమంత్ రావు లాంటి నేతలు ఏమయ్యారు.. జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు అని హరీష్ రావ్ రేవంత్ పై విరుచుకపడ్డారు.