ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేయొద్దని రాజ్యాంగంలో ఉందా? : మర్రి జనార్దన్ రెడ్డి

-

రాష్ట్రంలో రెండోరోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సుమారు 70 బృందాలతో ఐటీ అధికారులు.. స్థిరాస్తి , హోటల్స్ వ్యాపారంలో భాగస్వామ్యం కలిగిన వారి ఇళ్లు , కార్యాలయాల్లో సోదాలు చేస్తారు. అందులో భాగంగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలో రెండోరోజు ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వారి కార్యాలయాల్లో ఆదాయపు పన్ను చెల్లింపు, వ్యయాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

సోదాలపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలం అయినంత మాత్రాన వ్యాపారాలు చేయొద్దని రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ ఐటీ అధికారులను నిలదీశారు. ‘‘నిన్నటి నుంచి సోదాలు చేస్తున్నారు. నా సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. ఎమ్మెల్యేలు వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా? వ్యాపారానికి తగిన పన్ను సక్రమంగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్లు పన్ను కట్టాం. సోదాలు చేస్తున్న ఐటీ అధికారులే తిరిగి నాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చి వెళ్తారు’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version