తాడి చెట్టు లెక్క పెరిగిండు… కానీ బుర్ర పెరగలేదని హుజురా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి కి శాసన సభ్యుడిగా కనీసం ఇంకిత జ్ఞానం లేదని… కార్య కర్త గా,యువ నాయకుడో,అనుకుంటున్నాడేమో అని సెటైర్లు పేల్చారు. ఆయన ఒక నియోజక వర్గానికి శాసన సభ్యులు అని.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి,మా నాయకులకు లేదని వెల్లడించారు.
కేసీఆర్ ,కేటీఆర్ మెప్పు పొందడానికి….కౌశిక్ రెడ్డి ఫోన్ టాపింగ్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఉక్కుపాదం మోపిందే సీఎం రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. టీవీలలో కనిపించడానికి అలా మాట్లాడుతున్నాడని…. ఫోన్ ట్యాపింగ్ చేసిన దౌర్భాగ్యం మీది మీ కేసీఆర్, కేటిఆర్ లదేనన్నారు. కట, కటాలలో ఉన్న అధికారులను అడిగితే తెలుస్తుందని…. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి సోయి తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడాలని చురకలు అంటించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.