బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో మోడీ సర్కార్ తెలంగాణ కి మొండి చేయి – కేటీఆర్

-

బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మోడీ సర్కార్ మొండి చేయి చూపిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమన్నారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్ తో  సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని కావాలనే కేంద్రం విస్మరించిందన్నారు.

మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటు అత్యవసరమన్నా.. కేంద్రం మరో నాలుగేళ్లులయినా పట్టలెక్కని ప్రాంతాలకు వాటింజ్ కేటాయించిందన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసం మూడేళ్లు పడుతుందన్నారు కేటీఆర్. అన్ని సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకుపోకపోవడం, ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి నిదర్శనమన్నారు. అన్ని అనుకూలతలు,అనుమతులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మసిటీకి మొండి చేయి ముమ్మాటికీ వివక్షే అంటూ మండిపడ్డారు. వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్  పార్క్ కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news