నాంపల్లి కోర్టుకు బయలుదేరిన నాగార్జున..!

-

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు నిన్న విచారణ చేపట్టి ఇవాళ నాగార్జున మిట్ నెట్ హాజరు కావాలని పేర్కొంది. దీంతో తాజాగా నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం వద్ద నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరాడు నటుడు నాగార్జున. మరి కొద్ది సేపట్లోనే అక్కినేని నాగార్జునతో పాటు విట్ నెస్ స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నది నాంపల్లి కోర్టు.

మంత్రి  కొండా సురేఖ కేటీఆర్ పై విమర్శలు చేస్తూ.. నటుడు నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆర్ అని.. నాగార్జున N కన్వెన్షన్ హాల్ విషయంలో కూల్చకుండా ఉండేందుకు కీలక ఒప్పందం కుర్చుకున్నారని.. చెప్పరాని విషయాలను మీడియాతో చెప్పింది. అనంతరం మంత్రి కొండా సురేఖ సమంతకు సారి చెప్పింది. తాను మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం వల్లనే తాను కేటీఆర్ పై మాట్లాడాడని పేర్కొన్న విషయం తెలిసిందే. నాగార్జున పరువు నష్టం దావా పై కోర్టు తీర్పు ఎలా ఉండనుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version