నరేంద్ర మోడీ పుట్టికతోనే బీసీ కాదు.. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో కలిపారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో కులగణన, ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడారు. కేసీఆర్ లాంటి బలిసిన నేతలు సర్వేలో పాల్గొన్నారు. కేసీఆర్ ఒక్క రోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపించారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా కేసీఆర్ కు లేదు.
మా లెక్కలు తప్పు పడితే బీసీలు శాస్వతంగా నష్టపోతారు. కులగణన పై ప్రణాలిక ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు. ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే కులగణన చేశామని తెలిపారు. కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ఇంటి ముందు మేల్కొలుపు డప్పు కొట్టండి. లేకపోతే సామాజిక బహిష్కరణ శిక్ష విధించండి. కేటీఆర్, కేసీఆర్ కుటుంబం సర్వే చేయించకపోతే సామాజిక బహిష్కరణ చేయండి అని సూచించారు. మోడీ, కేడీలు బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కులగణనను పారదర్శకంగా చేపట్టినట్టు గుర్తు చేశారు.