దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత దగ్గరి బంధువు మేకా శరణ్ కావటం గమనార్హం. ఇక.. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో శరణ్ ఫోన్ లభ్యం అయింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. కవిత కేసులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. రెండు సార్లు పిలిచినా మేక శరణ్ విచారణకు హాజరుకాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. మేకా శరణ్ ఇంట్లో ఈడీ.. సోదాలు జరుపుతోంది. కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారు. లిక్కర్ స్కాంలో మేకా శరణపై ఈడీ ఫోకస్ పెట్టింది.
తనను బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టు కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. వాదనలను విన్న కోర్టు… కవితకు మరో మూడు రోజుల ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీ పొడిగిస్తూ.. 26 తేదీ ఉదయం 11.30 గంటలకు కవితను కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది.