జైనూర్ లో సభలు, ర్యాలీలలకు నో పర్మిషన్ : జిల్లా ఎస్పీ

-

జైనూర్ సంఘటన దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. అనుమతులు లేకుండా గుమిగూడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా లోని అన్ని మండలాల నందు 163 BNSS సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అన్ని మండలాలలో బంద్ ఉందంటూ ప్రచారం చేసిన, బంద్ చేయడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

ప్రస్తుతం జైనూరు మండలం ప్రశాంత వాతావరణంలో ఉందని తెలిపారు. జైనూరు సంఘటన నందు కారకులపై కేసులు నమోదు చేయబడం జరిగిందని, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలెవరు గుంపులు గుంపులుగా తిరగడం, అనవసరంగా బయటకు రావడం చేయరాదని తెలిపారు. ఉద్రిక్తతలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఇతరులను జైనూర్ లోనికి అనుమతించడం జరగదని తెలిపారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులు నమ్మవద్దని సూచించారు. సోషల్ మీడియా నందు వదంతులను వ్యాప్తి చేసే వారిపై, మరియు గ్రూప్ అడ్మిన్ లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version