పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు వచ్చే నెలలో పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని గిరిజన, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవ తి రాథోడ్ తెలిపారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన, యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయా లని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పోడు భూముల సర్వే పూర్తి చేసి పట్టాలు సైతం సిద్ధం చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సోమేష్ కుమార్ తో కలిసి శుక్రవారం డిఆర్ కెఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామ సభలను నిర్వహించి తీర్మానం కాపీల ను జిల్లా స్థాయి కమిటీలకు వెంటనే పంపాలన్నారు. విజ్ఞాపనల పరిశీలన, సర్వేలను వెంటనే పూర్తి చేయడానికి ఆదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.14 లక్షల క్లేయిములు అందంగా, అధిక శాతం క్లేయిముల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు.