హైదరాబాద్‌ నగరానికి పవన్‌ కల్యాణ్ భారీ విరాళం..సీఎంఆర్‌ఎఫ్‌కు కోటి ప్రకటించిన జనసేనాని

హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపున‌కు సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. .వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వర్ష బీభత్సంతో హైదరాబాద్ నగరం తల్లిడిల్లిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు..
తాజాగా జనసేన అధినేత,సినీ హీరో పవన్‌ కళ్యాన్‌ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్ర‌క‌టించారు.

హైదరాబాద్‌లో వరద నష్టాల ప్రజలను అదుకునేందుకు విరాళం ఇస్తున్నట్లు ప్ర‌క‌టించారు..ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు..మన ప్రజలకు మనందరం అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు..జనసైనికులు వరద సహయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి పవన్‌ కల్యాణ్ కోరారు.
ఇప్పటికే ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి,మ‌హేశ్‌బాబులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ప్ర‌క‌టించారు.మ‌రో హీరో నాగార్జున రూ.50 ల‌క్ష‌లు, జూనియ‌ర్‌ ఎన్టీఆర్ 50లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, ద‌ర్శ‌కులు త్రివిక్రమ్ శ్రీనివాస్ 10లక్షలు, అనీల్ రావిపూడి 5లక్షలు విరాళం ప్ర‌క‌టించారు.