కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తీరు సరిగా లేదు : పాయల్ శంకర్

-

రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది అని బీజేఎల్పీ డిప్యూటి లీడర్ పాయల్ శంకర్ అన్నారు. దాదాపు 20నుండి 25 అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నం. రైతు, నిరుద్యోగం, భద్రతలు, మూసీ, హైడ్రా 317జీవో వంటి సమస్యలతో పాటు ప్రజా సమస్యల అంశాలను అసెంబ్లీలో లేవనెత్తుతాం. కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఏదో సాధించినట్టు గొప్పలు కొట్టుకుంటుంది. కానీ ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలను మరిచిపోయారు అని అన్నారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తీరు కూడా సరిగా లేదు. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఇంత వరకు సభ్యులకు సమావేశ ఎజెండా కూడా చెప్పలేదు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ ప్రజా సమస్యలు ప్రస్తావించే విధంగా 30 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం అని పాయల్ శంకర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version