తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు – పొంగులేటి

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ముత్యాలగూడంలో పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ లో కెసిఆర్ అభద్రతా భావంతో మాట్లాడారని అన్నారు. ప్రభుత్వం చేజారుతుందనే ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతుల రుణ మాఫీ అంటూ ఎన్నికల కోసమే హడావుడి చేస్తున్నాడన్నారు.

తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత మీకు హామీలు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ కి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైస్ రాజశేఖర రెడ్డి అడిగిన వారికల్లా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని.. కెసిఆర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కాళ్లు అరిగేలా తిరిగినా ఇవ్వలేదని ఆరోపించారు. కెసిఆర్ ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఎన్నికల కోసమేనన్నారు పొంగులేటి.

రాభోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ 2 లక్షల రూపాయలు రైతుల రుణాలను మాఫీ చేస్తుందన్నారు. అధికారం ఉందని అక్రమ కేసులు పెట్టస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులు చేతిలో ఉన్నారని అర్థ రాత్రి కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం మంచిది కాదని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు కర్రు కాసి వాత పెట్టడం ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version