పరిపాలన తెలియని ముఖ్యమంత్రి పై మునుగోడు ప్రజలు తిరగబడాలి – మాజీ ఎంపీ వివేక్

-

పరిపాలన తెలియని ముఖ్యమంత్రి పై మునుగోడు ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ, మునుగోడు ఉప ఎన్నిక బిజెపి స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నాంపల్లి మండలం దామెర గ్రామంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు.

మోడీ పాలనలో ఉత్తరప్రదేశ్ లో 50 లక్షల ఇల్లు నిర్మిస్తే.. తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో 16 లక్షల ఇళ్ళు కట్టే అవకాశం ఉన్నా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. తన కుటుంబం కోసం మాత్రం 100 ఎకరాలలో ఫాంహౌస్ నిర్మించుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఇల్లు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇళ్ళ నిర్మాణం కోసం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news