జాబిల్లి చుట్టూ ఏముందో తెలుసుకునేందుకు చంద్రయాన్-3 పేరుతో ఇస్రో వ్యోమనౌక విక్రమ్ ల్యాండర్‌ను పంపిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3లో కీలకమైన ఆపరేషన్ ‘మూన్ బౌండ్ మానివర్’ను ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం పూర్తిచేశారు. చంద్రుడికి సమీపంలోకి వెళ్తున్న విక్రమ్ ల్యాండర్‌తో కూడిన ప్రజ్ఞాన్ రోవర్ గమనం ఇవాళ ఉదయంతో మొదలవనుంది. ఇక అప్పటి నుంచి చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టే అంత వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..?
చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్‌ల కదలికల సమాచారాన్ని హైదరాబాద్ నగరంలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అందించనుంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టేంత వరకు ఇస్రో అధికారిక సమాచారాన్ని ప్లానెటరీ సొసైటీ సభ్యులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, విద్యార్థులకు అందించనున్నారు. 79934 82012 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సందేహాల నివృత్తికి మెసేజ్ చేస్తే సమాధానాలు పంపించనున్నట్లు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంచాలకులు ఎన్.శ్రీరఘు నందన్‌కుమార్ తెలిపారు.
చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడి వద్దకు ఎలా వెళ్లనుంది? ఇతర దేశాలు చంద్రుడిపై పంపించిన వ్యోమనౌకలు, ల్యాండర్లు ఎలా వెళ్లాయి? అన్న అంశాలను వివరించనున్నారు.