మోదీ, కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు: భట్టి విక్రమార్క

-

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా క్రెడిట్ ఉన్నా దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పాదయాత్రలు, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటకు రావడం, రైతు డిక్లరేషన్ ప్రకటించడం కూడా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచింది.

తాజాగా ఆయన ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ పార్టీ, ప్రబుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయకుండా కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని.. రానున్న ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news