తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్…. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్

-

తెలంగాణలో నిరుద్యోెగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం చెప్పిన విధంగానే నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. తాజాగా పోలీస్ నియామాకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్పైలు కలిపి మొత్తం 16,027 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5010, సివిల్ కానిస్టేబుళ్లు 4965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4423, తెలంగాణలో మొత్తం 587 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. వీటితో పాటు స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ డిపార్ట్ మెంట్ 610, డ్రైవర్లు 100 పోస్టులు ఉన్నాయి. మే 2 నుంచి మే 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్  చైర్మన్ వీవీ శ్రీనివాస రావు వెల్లడించారు. ఆశావహ అభ్యర్థులు www.tslprb.in వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news