పొంగులేటి పాదయాత్ర..సొంత పార్టీ కోసమే.!

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు..ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రధాన నేతలు పాదయాత్రలు చేసారు. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. ప్రస్తుతం భట్టి పాదయాత్ర ఇంకా కొనసాగుతుంది.

ఈ క్రమంలోనే పొంగులేటి సైతం పాదయాత్ర చేయాలని చూస్తున్నారు. అయితే ప్రధాన పార్టీల నేతలు..తమ తమ పార్టీలని బలోపేతం చేయడం కోసం పాదయాత్ర చేశారు. మరి పొంగులేటి ఎవరి కోసం పాదయాత్ర చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగా వెళుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బి‌జే‌పిలు ఆయన్ని ఆహ్వానించాయి..కానీ ఆయన ఏ పార్టీలో చేరేది అనేది చెప్పలేదు. అసలు ఏ పార్టీలో చేరతారో క్లారిటీ లేదు.

ఒకవేళ వేరే పార్టీలో చేరాలనుకుంటే పాదయాత్ర చేయాలసిన అవసరం లేదు. అంటే సొంతంగా పార్టీ పెడుతున్నారు కాబట్టే..ఆయన బలాన్ని పెంచుకునేందుకు పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అలాగే బి‌ఆర్‌ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలని ఏకం చేయాలని పొంగులేటి ప్లాన్ చేశారు. ఇప్పటికే తన తో పాటు జూపల్లి కృష్ణారావు బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చారు. ఇంకా కొందరు కీలక నేతలు కూడా బయటకొచ్చారు. ఈ క్రమంలో వారందరినీ సమన్వయం చేసుకుని..పొంగులేటి కొత్త పార్టీ పెట్టి, బి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే తన బలాన్ని పెంచుకునే క్రమంలో ప్రజా మద్ధతు కోసం పాదయాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి పొంగులేటి పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది..కొత్త పార్టీ ఎప్పుడు పెడతారో.

Read more RELATED
Recommended to you

Latest news