సీఎం కేసిఆర్ కి ఎన్నికల రోగం వచ్చినట్లు ఉందని మండిపడ్డారు మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. డ్రామాలు, తమాషలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేస్తున్నట్లుగా రుజువు చేసుకోవడానికి.. యదాద్రి థర్మల్ విద్యుత్ చూసేందుకు కేసిఆర్ వెళ్ళాడని ఆరోపించారు. ఒక ద్రోహంతో తెలంగాణ రాష్ట్రన్ని అప్పుల పాలు చేయడానికి చేస్తున్నారని అన్నారు.
అసెంబ్లీలో గీతలు గిసి కాళేశ్వరం మొదలు పెట్టాడని.. ఇప్పుడు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రజలను మభ్య పెట్టేందుకే అన్నారు. నాలుగు వేల మెగావాట్ల అంచనా 29 వేల కోట్లు కాగా.. ఇప్పటికే నలభై వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నీళ్ళు, బొగ్గు ఉన్న ప్రాంతంలో మొదలు పెట్టింది పక్కన పెట్టారని మండిపడ్డారు. ఈ పవర్ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ 9 రూపాయల కు పైగా ఉంటుందన్నారు.ఛత్తీస్ ఘడ్ నుంచి కొనే కరెంట్ ఏ ధరకు కొంటున్నారో చెబుతావా? అని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క యూనిట్ అయిన కరెంట్ ఉత్పత్తి చేశారా అంటూ ద్వజమెత్తారు పొన్నాల లక్ష్మయ్య.