టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లి.. గర్భిణి మృతి!

-

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న టెట్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. టెట్ పరీక్ష రాయడానికి వచ్చిన గర్భిణి అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. అసలేం జరిగిందంటే..?

గచ్చిబౌలి  ఇంద్రానగర్ నుంచి తన భర్త అరుణ్ పిల్లలు అమృత వర్షిణి, కాత్యాయనితో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చింది రాధిక అనే గర్భిణి. పరీక్ష ప్రారంభ సమయం దగ్గర పడటంతో వేగంగా పరీక్ష కేంద్రంలోని తన గదికి చేరుకుంది. వేగంగా వెళ్లడంతో నిండు గర్భిణీకావడం, బీపీ ఎక్కువయింది. ఎగ్జామ్ హాల్​లోకి వెళ్లిన కాసేపటికే చెమటలు బాగా పట్టి అక్కడికక్కడే కుప్పకూలింది.

అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆమె భర్త అరుణ్  పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో ముక్కు నుండి రక్తం కారింది. ఆస్పత్రికి తీసుకువెళ్లిన తర్వాత పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించిందని ధ్రువీకరించారు. వేగంగా నడవడం వల్ల గుండెపోటు వచ్చి మహిళ మృతి చెంది ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. రాధిక మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version