ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం అయినటువంటి లోటస్ పాండ్ వద్ద అక్రమ కట్టడాలను ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అక్రమ కట్టడాలను కూల్చివేయించిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ను బదిలీ చేశారు. అప్పుడు ఇన్ చార్జీ కమిషనర్ అమ్రపాలీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.
అయితే ఆమ్రపాలీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా బదిలీ అయ్యారు. తాజాగా తెలంగాణలో దాదాపు 40 మందికి పైగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ముఖ్యంగా జగన్ ఇల్లు ముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా.. మాకు తెలీయకుండా జరిగిందని GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌ను 10 రోజుల కిందట బదిలీ చేశారు. ఇప్పుడు ఆయనకు TSMSIDC ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ఉత్వర్వులు జారీ కావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం జగన్ కి అనుకూలంగా ఉందా..? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.