దివంగత ప్రధాని పీ.వీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నేడు పీవీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని కాపాడిన గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు అని మంత్రి తలసాని కొనియాడారు. పీవీ ఆర్థిక సంస్కరణల జాతిపితగా నిలిచారని అన్నారు.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని ప్రశంసించారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరు సాధించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పీవీ సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగిన రీతిలో గౌరవిస్తుందని చెప్పారు. పీవీ శతజయంతిని ఎంతో ఘనంగా నిర్వహించామని, నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ గా నామకరణం చేయడమే కాకుండా.. భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.