తెలంగాణ, ఏపీ ప్రజలకు అలర్ట్‌..ఇవాళ భారీ వర్షాలు

-

తెలంగాణ, ఏపీ ప్రజలకు అలర్ట్‌. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కాగా, నిన్న హైదరాబాద్‌ మహా నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సాయంత్రం 6 గంటల తర్వాత నగర వ్యాప్తంగా వర్షం ప్రారంభం కావడంతో.. వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురు అయ్యాయి. ఇక ఇవాళ కూడా హైదరాబాద్‌ లో వర్షం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news