తెలంగాణలో 4 రోజులపాటు భారీ వర్షాలు

-

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రోజున జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఆదివారం రోజున నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఇక మంగళ, బుధవారాల్లోనూ ఈ జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు నాలుగు రోజులకు గాను ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలోని పిప్పల్దారిలో 6.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 5.9, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలో 5.3, ఖమ్మం జిల్లా ఖానాపురంలో 5.1 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version