రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత రామ్మోహన్ గౌడ్ బిఆర్ఎస్ లో చేరనున్నారు. ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ ను రామ్మోహన్ గౌడ్ ఆశించారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మధు యాష్కి టికెట్ కేటాయించింది. దీంతో అసంతృప్తితో ఉన్న రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు రామ్మోహన్ గౌడ్ ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించనున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన రామ్మోహన్ గౌడ్ బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ రామ్మోహన్ గౌడ్ కు దక్కలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుండి రామ్మోహన్ గౌడ్ బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్.కృష్ణయ్య చేతిలో ఎం. రామ్మోహన్ గౌడ్ ఓటమిపాలయ్యారు. ఇక ఇవాళ ఎల్బీనగర్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.