బీసీలకు కేసీఆర్‌ శుభవార్త..ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి 10 ఏళ్లు సడలింపు

-

బీసీలకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాల్లో బీసీలకు వయో పరిమితిలో 10 ఏళ్లు సడలింపు ఇస్తూ కీలక నిర్నయం తీసుకుంది తెలంగాన రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రయోజనాలు మే 31, 2031 వరకు అమలు అయ్యేలా ఆదేశాలు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌.

కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో.. చాలా మంది బీసీలకు మేలు చేకూరనుంది. కాగా తెలంగాణ కేబినెట్ ఈ రోజు సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం నివాసం ప్రగతి భవన్ లో ఈ భేటీ జరుగనుంది.

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో నేడు కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ ఆమోదం కోసమే కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 2022-23 కు సంబంధించి బడ్జెట్ ను ఆమోదం తెలుపనుంది కేబినెట్. రేపు ఉభయ సభల్లో రెండింటిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version