తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్. గ్రూప్-1 పరీక్షలో 8 ప్రశ్నలు తొలగించారు అధికారులు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో సరైన సమాధానాలు లేని కారణంగా 8 ప్రశ్నలను TSPSC తొలగించింది. మరో 2 ప్రశ్నలకు ప్రిలిమినరీలో ఇచ్చిన ఆప్షన్లను మార్చింది. గ్రూప్-1 పరీక్షను 150 మార్కులకు నిర్వహించగా… ఇప్పుడు 8 ప్రశ్నలను తొలగించడంతో 142 ప్రశ్నలనే పరిగణలోకి తీసుకుంటారు. కానీ మార్కులను మాత్రం 150 మార్కులకే లెక్కిస్తారు.
దీంతో ఒక్కో సరైన సమాధానానికి 1.05 మార్కులను కేటాయించే ఛాన్స్ ఉంది. కాగా, టీఎస్‌పీఎస్సీ మంగళవారం రాత్రి తన వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో మాస్టర్ ప్రశ్నపత్రం ప్రకారం 3, 4, 5, 46, 54, 114, 128, 135.. ఎనిమిది ప్రశ్నలను తొలగించిన కమిషన్ రెండు ప్రశ్నల సమాధానాలను మార్చింది. 38వ ప్రశ్నకు ప్రాథమిక కీలో సమాధానం 3 ఉండగా తుది కీలో సమాధానం 2గా మారింది. అలాగే… 59వ ప్రశ్నకు సరైన జవాబును 1 నుంచి 3గా మారింది.