రేవంత్ రెడ్డిని తెలంగాణ చంద్రబాబు అని అంటారు – డీకే అరుణ

-

తెలంగాణలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు అంటారని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేసిందే చంద్రబాబు అని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని అన్నారు. బిజెపిని విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు డీకే అరుణ. రేవంత్ మాట తీరు మార్చుకోవాలని సూచించారు.

ఫ్రస్టేషన్లో రేవంత్ మాట్లాడుతున్నారని.. నోటిని భద్రంగా పెట్టుకో రేవంత్ రెడ్డి అంటూ హెచ్చరించారు. సోనియాగాంధీపై, వైయస్ఆర్ పై రేవంత్ మాట్లాడిన మాటలు జనాలు ఇంకా మర్చిపోలేదు అన్నారు. మహారాష్ట్రలో అనైతిక పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీతులు చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే మీకు చేతకాలేదని దుయ్యబట్టారు. ఉప ఎన్నిక వస్తే తన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే భావనతోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news