కమ్యూనిస్టులను చూస్తే జాలేస్తుంది – రేవంత్ రెడ్డి

-

మునుగోడులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిన కమ్యూనిస్టులను చూస్తే నాకు జాలేస్తోందని అన్నారు. మునుగోడులో కమ్యూనిస్టు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సెప్టెంబర్ 17 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం 5 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు బిజెపి ఎక్కడుందని ప్రశ్నించారు. సాయుధ పోరాటంలో సామాన్యులు తుపాకీ తూటాలకు బలైన నాడు బిజెపి ఎటు పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రాన్ని, నిజం ప్రభువు నుంచి విముక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం మాదని అన్నారు రేవంత్ రెడ్డి. మునుగోడు లో మన ఓట్లు మనం వేసుకున్నా కాంగ్రెస్ పార్టీకి 25వేల మెజారిటీకి పైగా వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news