రైతులు అకాల వర్షాలతో నష్టపోతే.. కేసీఆర్ కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నాడు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. చాలా చోట్ల వడ్లు కల్లాల్లో ఉండగా… వర్షాల వల్ల తడిసి పోయాయి. కనీసం వడ్లపై కప్పేందుకు టార్పలిన్ కవర్లు లేక రైతుల చాలా నష్టపోతున్నారు. మరోవైపు అకాల వర్షాల వల్ల మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వడగండ్ల వల్ల మామిడి పూత రాలింది. అయితే సర్కార్ రైతుల ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడం వల్లే రైతులు నష్టపోతున్నారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. 

తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు. 16 రోజుల పాటు కేసీఆర్ కుంభకర్ణుడిలా ఫామ్ హౌజ్ లో సేదతీరాడని… రైతేమో కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని.. ఐకేపీ కేంద్రాల్లో టార్పాలిన్లు గతిలేక రైతుల కష్టం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని.. ఇదే రాక్షసత్వం కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. కర్షకులే నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news