బ్రహ్మానందం-రవితేజ గుండ్లు కొట్టి డబ్బులు పంచుకునేలా ఉంది BJP- TRS పంచాయతీ – రేవంత్ రెడ్డి

-

బిజెపి – టిఆర్ఎస్ పార్టీలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ రెండు పార్టీలు పోటా పోటీగా ఓటుకు రూ. 30 నుంచి 40 వేలు పంచుతున్నాయని ఆరోపించారు. కెసిఆర్ దేశమంతా నాది అంటున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి టీఆర్ఎస్ పార్టీలది మిత్రభేదమే కానీ.. శత్రుభేదం లేదని విమర్శించారు.

ఈ రెండు పార్టీలు అరాచక శక్తులుగా మారాయని అన్నారు. విక్రమార్కుడు అనే సినిమాలో బ్రహ్మానందం, రవితేజ లాగా గుండ్లు కొట్టి డబ్బులు పంచుకునే పంచాయితీ లెక్క ఉంది టిఆర్ఎస్, బిజెపి పంచాయతీ అంటూ ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పై తాను వేసిన పిటీషన్ విచారణ పూర్తి అయ్యేవరకు ఆ పార్టీ బిఆర్ఎస్ గా మారదని అన్నారు. దీనిపై ఢిల్లీ కోర్టుకు కూడా వెళుతున్నామన్న రేవంత్ రెడ్డి.. ఒకటి రెండు రోజుల్లో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు.

ఇన్ కం టాక్స్ నిర్మల సీతారామన్ పరిధిలోనిదని.. టిఆర్ఎస్ గులాబీ చెందాల విషయంపై ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. ఇక కెసిఆర్ చిత్ర విచిత్ర పనులు, మాటలు ఆయనకు అలవాటేనని అన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news