బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకుంది. నిన్న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమై సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. ఈ భేటీలో సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ఇవాళ థాక్రె, డీకే శివకుమార్ లు భట్టి, ఉత్తమ్ లతో భేటీ అయ్యారు. అదేవిధంగా ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తెలంగాణ సీఎం అభ్యర్థి పై చర్చలు జరిపారు.ఇవాళ సాయంత్రం వరకు ప్రకటిస్తామని మల్లికార్జున ఖర్గే చెప్పినప్పటికీ సాయంత్రం అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. తాజాగా కేసీ వేణుగోపాల్ ఇంట్లో చర్చలకు భట్టి, ఉత్తమ్ లు హాజరై చర్చలు జరిపారు. ఈ చర్చలకు థాక్రె, డీ.కే.శివకుమార్ కూడా హాజరయ్యారు. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, క్యాబినెట్ కూర్పు వంటి అంశాలపై చర్చించారు. మరోవైపు అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. మరి కొద్ది సేపట్లోనే కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version