కాళేశ్వరంలో మూడు బ్యారేజీల పనులు…కొనసాగుతున్నాయి. మూడు బ్యారేజీలలో కలిపి మొత్తం 57 సీకెండ్ పనులు చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేడిగడ్డలో ప్రస్తుతం 7 టెస్టులు, పనులు సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 30వ తేదీ లోపు టెస్టులు ఇతర పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం.
మేజర్ గా షీట్ ఫైల్, క్రాక్స్ ఫిల్, సాండ్ క్రౌటింగ్, గేట్లు ఎత్తాలని అనేది ప్రాధాన్యతగా తీసుకున్న ప్రభుత్వం…మేడిగడ్డలో బ్లాక్ 7కి మాత్రమే కాపర్ డ్యాం నిర్మిస్తోంది. మూడు బ్యారేజీలకు కలిపి దాదాపుగా 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది సర్కార్.
అటు జూన్ 6న హైదరాబాద్ కు కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర గోష్ రానున్నారు. అందిన రిపోర్టులు, వచ్చిన ఫిర్యాదులను మొదటగా పరిశీలించనున్న చంద్ర గోష్…రెండో వారంలో పలువురికి సమన్లు జారీ చేయనున్నారు. కాలేశ్వరంలో పనిచేసిన ఈఎన్సీలు, ఇంజనీర్లను, మాజీ అధికారులను పిలవనున్న చంద్రబోస్….ఫిర్యాదులు చేసిన వాళ్లను కూడా పిలిచి విచారణ చేయనున్నారు.