సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ఆయన ఈ లేఖ రాశారు.” బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళన చేస్తున్నారు. వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యాశాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారు. మరోవైపు మీ పుత్రరత్నం మంత్రి కేటీఆర్ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జూన్ 15న ట్వీట్ చేశారు. ఇది చెప్పి కూడా ఐదు రోజులు అయింది. కానీ ఎటువంటి అతీగతీ లేదు.

దాదాపు 8 వేల మంది విద్యార్థులు ఆందోళన చేస్తుంటే భోజనం పెట్టమని హెచ్ఓడిలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు సఫలం.. సోమవారం నుంచి విద్యార్థులు తరగతులకు హాజరు అవుతారని సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. మీ రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి బిఆర్ఎస్ పేరిట గంటలతరబడి ఏసీ రూముల్లో చర్చించుకోవడానికి, తెలంగాణను వ్యతిరేకించిన శక్తులతో సమావేశానికి సమయం ఉంటుంది. తిరిగి అధికారంలోకి రావడానికి చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలపై పీకే వంటి వారితో చర్చించడానికి కూడా సమయం ఉంది మీకు. కానీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారంరోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళనలు చేస్తుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ఐదు నిమిషాల సమయం కేటాయించే తీరిక కూడా దొరకడం లేదా? అని ప్రశ్నిస్తూ లేఖలో పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా విద్యార్థుల డిమాండ్లను కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు.1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సిటీని సందర్శించాలి. 2. రెగ్యులర్ విసీని నియమించాలి, ఆయన క్యాంపస్ లోనే ఉండాలి. 3. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య పెంచాలి. 4. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి.5. ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి. 6. తరగతి, హాస్టల్ గదులకు మరమ్మతులు చేయాలి. 7. ల్యాప్టాప్లు, యూనిఫాంలు, మంచాలు, బెడ్లు అందించాలి. 8. మెస్ ల మెయింటెనెన్స్ మెరుగ్గా ఉండేలా చూడాలి. 9. పిడి, పీఈటీల ను నియమించి క్రీడలను ప్రోత్సహించాలి. అని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news