తెలంగాణ రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చింది ఆర్టీసీ. దసరా పండుగకు ఆర్టీసీ చార్జీల బాదుడు మొదలైందని వార్తలు వస్తున్నాయి. బేసిక్ ధరను ప్రత్యేక సర్వీసుల టికెట్ పేరుతో 50 శాతం పెంచి వసూలు చేస్తున్నారట ఆర్టీసీ అధికారులు. ఆదిలాబాద్ సూపర్ లగ్జరీ రెగ్యులర్ బస్సులో ఛార్జీ రూ.630 ఉండగా ప్రత్యేక బస్సులో రూ.880 అవుతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సిటీలో నడిపే ఆర్ధినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులనూ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో దూరప్రాంతాలకు నడుపుతూ ఛార్జీలు దండుతుందని అంటున్నారు. ఇక హైదరాబాద్ – ఖమ్మం మధ్య 10వ తేదీన డీలక్స్ బస్సులను ప్రత్యేక బస్సులుగా చేసి రూ.440 తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అదే సూపర్ లగ్జరీ టికెట్ (రెగ్యులర్) రూ.430 ఉందని చెబుతున్నారు. ప్రత్యేక బస్సుల పేరుతో సూపర్ లగ్జరీ కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.