నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ !

-

ఇవాళ తెలంగాణ రాష్ట్రం లో పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది తెలంగాణ ABVP. సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ,ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాఠశాల విద్యా కార్యాలయం (commissioner and Directorate Of School Education) ముందు ABVP ధర్నా నిర్వహించింది. సర్కారు పాఠశాలను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని.. స్కూళ్లు ప్రారంభమై 20 రోజులైనా బుక్స్ పంపిణీ చేయకపోవడం సిగ్గు చేటు అని ఆగ్రహించింది ABVP.

రాష్ట్రంలో 90% ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు లక్షల్లో డొనేషన్, అధిక ఫీజు వసూలు చేస్తున్న ప్రభుత్వ చర్యలు శూన్యమని.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినా విద్యా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడింది. మన ఊరు-మన బడి కేవలం ప్రకటనకే పరిమితమైందని.. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు అధిక ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ లేదని తెలిపింది.

రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని… సర్కారు పాఠశాలల్లో సత్వరమే బుక్స్ పంపిణీ చేసి, మౌలిక వసతులు కల్పించాలని వెల్లడించింది ABVP. సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ,ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న తెరాస ప్రభుత్వ తీరును, శాంతి యుత ధర్నాను అణచివేస్తూ పోలీసుల లాఠీఛార్జ్ ను నిరసిస్తూ నేడు తెలంగాణ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది ABVP.

 

Read more RELATED
Recommended to you

Latest news