తెలంగాణ యాదవులకు శుభవార్త.. ఉగాది తరువాత రెండో విడత గొర్రెల పంపిణీ

-

కురుమ సంఘం బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు. ఉగాది, శ్రీ రామనవమి తరువాత రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని ప్రకటించారు హరీష్‌ రావు. యూనిట్ కాస్ట్ కూడా పెంచాముమని.. బాల్యవివాహాలను ఆపింది సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కళ్యాణాలక్ష్మి కోసం 18 సంవత్సరాలు అర్హత పెడితే బాల్య వివాహాలు ఆగిపోయాయని.. బీజేపీ ప్రభుత్వాన్ని బిసి సంక్షేమ శాఖ కావాలని ఆడిగామన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అతిగతి లేదని..వాళ్ళకి ఎప్పుడు అంబానీ, ఆధాని కావాలని ఫైర్‌ అయ్యారు.

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని.. తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్యని స్ఫూర్తిని తీసుకున్నామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారని… పక్క రాష్ట్రాల్లో మోటర్లకు మీటర్లు పెట్టి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకున్నారని వివరించారు. హైదరాబాద్ లో కురుమ జాతి ఆత్మగౌరవ భవనం రెండు నెలల్లో పూర్తవుతుంది…కొమురవెళ్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. కురుమలకు కొమురవేల్లి మల్లన్న ఆలయ చైర్మన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దని… కేసీఆర్ ఏ పని చేసిన వాటికి దేవుళ్ళ పేరే పెడుతారన్నారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news