800 కోట్ల మంది కోసం సికింద్రాబాద్‌ లో కేఏ పాల్ బహిరంగ సభ

-

జాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజల కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో శాంతి సభలు నిర్వహిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న కే ఏ పాల్, వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం కూడా పంపారు.

- Advertisement -

అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రపంచ శాంతిసభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో ప్రజా గాయకుడు గద్దర్, కోదండ రామ్ తో కలిసి వాల్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి సభకు అనుమతి ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇలాంటి సభ ద్వారా దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు వివరించే అవకాశం దక్కడం అదృష్టం అన్నారు. కేవలం శాంతి సభలే కాకుండా ఎకనామిక్ సబ్మిట్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. దేశ, రాష్ట్ర నాయకుల కారణంగా భారతదేశం అభివృద్ధిలో వెనక పడుతోందని అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...