రేవంత్ రెడ్డి ఇలాకాలో వైఎస్ షర్మిల పాదయాత్ర

వికారాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి ఇలాకా అయిన కొడంగల్ నియోజకవర్గం లో వైస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేయనున్నారు. నియోజకవర్గంలోనే ఐదు రోజులు పాద యాత్ర నిర్వహించనున్న షర్మిల.. మొదటి రోజు అంటే నేడు కొడంగల్ నియోజకవర్గ కేంద్రం బండ ఎల్లమ్మ దేవాలయం నుండి ప్రారంభం మరియు అంబేద్కర్ కూడలి లో బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు పెద్ద నందిగామ క్రాస్ రోడ్డు నుండి ప్రారంభ మై పర్సా పూర్, హస్నాబాద్ మీదుగా, కొత్తగా ఏర్పడ్డ దుద్యాల మండలం లోని దుద్యాల, మరియు లగచర్ల గ్రామ స్టేజి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు.

ఎల్డుండి దుద్యాల మండలం, హకీమ్ పేట్ నుండి ప్రారంభ మై పోలేపల్లి స్టేజి,కోస్గి మండలం లోని సర్జఖాన్ పేట్, కోస్గి, చెన్నారం గ్రామాల మీదుగా యాత్ర కొన సాగి…ముక్తి పాడు చేరిక..వైస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పిస్తారు. 12వ తేదీన కోస్గి మండలం ముశ్రీఫా లో తిరిగి యాత్ర ప్రారంభమై దౌల్తాబాద్ మండలం లోని సూరాయి పల్లి, బోల్వోని పల్లి, బంటోని బావులు, చల్లాపూర్ వరకు కొనసాగనుండగా.. ఈర్లపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన వైస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించ నున్నారు షర్మిల.

అనంతరం ఊరకుంటా, దౌల్తాబాద్ వరకు యాత్ర కొనసాగిస్తారు. ఐదవరోజు 13:తిరిగి దౌల్తాబాద్ మండలం లో యాత్ర ప్రారంభ మై పోచమ్మ గడ్డ, ర్యాలకుంట, రామన్న కుంట తండా, తిమ్మారెడ్డి పల్లి క్రాస్ రోడ్డు, గోక ఫస్లా బాద్, పోల్కం పల్లి క్రాస్ నంద్యా నాయక్ క్రాస్ రోడ్డు మీదుగా దేవరఫస్ల బాద్ వరకు కొనసాగించనున్నారు. మద్దూర్ మండలం లోని దమగన్ పూర్ లో మాట ముచ్చట్ల తో… నాగిరెడ్డి పల్లి లో ప్రజా ప్రస్థాన యాత్ర ముగించనున్నారు.