ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించిన వైస్ షర్మిల

సంగారెడ్డి జిల్లాలో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదు అయింది. YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు సంగారెడ్డి పోలీసులు. అయితే.. తనపై నమోదైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందించారు వైఎస్‌ షర్మిల. అంతేకాదు.. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరో సారి షర్మిల ఫైర్ అయ్యారు.

నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు…నేను నీ అవినీతిని ఎత్తి చూపితే తప్పా అని నిలదీశారు. పండిత పుత్ర పరమ శుంఠ..అని మీ నాన్నే చెప్పారు కదా.. నేను చెబుతే తప్పా అని చురకలు అంటించారు. ఆందోల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు అవినీతి కబ్జాలకు పాల్పడుతున్నారని సొంత తండ్రే చెప్పారని.. నేను అదే చెప్పాను..మరి మీ తండ్రి పై కూడా కేసు పెడతారా అని నిలదీశారు. దళిత ఎమ్మెల్యే అవినీతి చేస్తే ప్రశ్నించవద్దని ఏ రాజ్యాంగంలో రాసి ఉందని ప్రశ్నించారు వైఎస్‌ షర్మిల.