ప్రభుత్వ అవినీతిపై సిట్ విచారణ చేపట్టాలి – వి.హనుమంతరావు

-

టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సిట్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సిట్ విచారణలో ఏం తేలకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందేనని.. తెలంగాణలో రైతులు చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రం లో ఒక వైపు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది… మరో వైపు రైతుల పట్ల కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

మహరాష్ట్రలో వెళ్లి కిసాన్ సర్కార్ అని ప్రగల్బాలు పలకటం కాదు.. రాష్ట్రంలో బాధ పడుతున్న రైతుల కన్నీళ్లు తుడవాలన్నారు. 2 లక్షలు తీసుకుని డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదా..? 3 లక్షలు కమిషన్ తీసుకుని దళిత బంద్ ఇవ్వలేదా…? అని ప్రశ్నించారు. తెలంగాణ నెంబర్ వన్ అంటున్నావు… నేనూ చెప్తున్నా ఆరోపణలపై స్పెషల్ సిట్ వెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నానన్నారు.

దళిత బందులో కమిషన్ తీసుకోవటంలేదు అని నిరూపిస్తే నేనూ రాజకీయ సన్యాసం తీసుకోవటానికి కూడ రెడీ అన్నారు. నూతన సచివాలయం వద్దకు సాధారణ ప్రజలు కాదు కదా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఆంక్షలు విధించారని అన్నారు. రాష్ట్రంలో వున్న ప్రజలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వి హనుమంతరావు. సూర్యపేటలో పెద్ద ఎత్తున బీసీ గర్జన సభ పెడతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version