BREAKING : మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

-

BREAKING : మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాలకు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం సహా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణ పై దాఖలైన పిటిషన్లను ఇవాళ విచారణకు స్వీకరించింది సుప్రీం కోర్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణను వ్యతిరేకిస్తూ సుప్రీం ను ఆశ్రయించారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహా భూ నిర్వాసిత రైతులు.

ఈ నేపథ్యంలోనే…విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, తెలంగాణ ప్రభుత్వం సహా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 27 కు వాయిదా వేసింది దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు.

ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని ప్రకటన చేసింది. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ కోరారని.. అయితే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు ప్రకటన చేశారు. అందువల్ల ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు స్కీం లో చేర్చడానికి అర్హత లేదని తేల్చి చెప్పారు బిశ్వేశ్వర్ తుడు.

 

Read more RELATED
Recommended to you

Latest news