బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి కాసేపట్లో కరీంనగర్ లోని బండి సంజయ్ నివాసానికి చేరుకోనున్నారు. పదవ తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్ లో వైరల్ చేసిన కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం ఉదయం బెయిల్ పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జైలు అధికారులకు బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ బెయిల్ పేపర్లు సబ్మిట్ చేశారు.
అనంతరం జైలు అధికారులు పేపర్లను పరిశీలించి బండి సంజయ్ ని జైలు నుండి విడుదల చేశారు. జైలు నుండి విడుదలైన బండి సంజయ్ కి సంఘీభావం తెలపనున్నారు తరుణ్ చుగ్. బిజెపి అధిష్టానం ఆదేశించడంతో తరుణ్ చుగ్ కరీంనగర్ కి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు బండి సంజయ్, తరుణ్ చుగ్.