BRSకు రాజీనామా చేస్తా : తాటికొండ రాజయ్య

-

BRS మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ప్రకటన చేశారు. గత కొంత కాలంగా బీఆర్‌ఎస్‌ పార్టీపై అసంతృప్తిగా ఉన్న తాటికొండ రాజయ్య తాజాగా కీలక ప్రకటన చేశారు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్ లో చిచ్చుపెట్టింది.

ఆ టికెట్ ఆశిస్తున్న స్టేషన్ గన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య….పార్టీ స్పందించకపోవడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. త్వరలో కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపుతానని వెల్లడించారు. ఇంతకాలం పార్టీ విధేయుడిగా ఉన్నానన్న ఆయన…. తగిన గుర్తింపు లేకపోవడం, పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version